సామాజిక సారథి, తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన పాపాలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తొర్రూర్ గ్రామానికి చెందిన సర్వేనంబర్ 383/1 లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూములు కోల్పోయిన రైతులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి కలిసి చర్చలు జరిపారు. 2007వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎకరాకు లక్షన్నర పరిహారమిచ్చి తమ భూములను లాక్కుందని, నిరుపేదలమైన మాకు న్యాయం చేయాలని వారు వాపోయారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా దళితరైతులతో చర్చించిన ఎమ్మెల్యే తప్పకుండా వారి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. హెచ్ఎండీఎ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్ లో అపుడు భూములు కోల్పోయిన దళిత రైతుకుంటుంబాలు 97మందికి 300 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలాలను కేటాయిస్తామని ఎమ్మెల్యే గారు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మాజీ డైరెక్టర్ ప్రభువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచులు అంజయ్య, బాబు, నర్సింహా, మాజీ ఎంపీటీసీలు అంజమ్మ, మేకం యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- January 10, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలను కడుగుతున్నాం