Breaking News

నీటి సంరక్షణ అందరి బాధ్యత

నీటి సంరక్షణ అందరి బాధ్యత
  • జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని పాలెం వ్యవసాయ కళాశాలలో టైర్- 3 శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సదరన్ రీజియన్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం యొక్క అక్విఫర్ మ్యాప్లు,  నిర్వహణ ప్రణాళికలను జిల్లా పరిపాలనకు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం జిల్లా భూగర్భ జలాల అధికారి ఎస్. రమాదేవి, డా. జి. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లా భూగర్భ జలాల నిర్వహణ, అక్విఫర్ మ్యాపింగ్, నిర్వహణపై సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ప్రదర్శనలు ఇచ్చారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జె. సిద్ధార్థ కుమార్, జిల్లా భూగర్భ జల అధికారి రమాదేవి, డీఆర్డీవో నర్సింగరావు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ హైడ్రో జియాలజిస్టులు రవి కుమార్ గుమ్మా, డాక్టర్ జి. ప్రవీణ్ కుమార్, టి. మాధవ్ పాల్గొన్నారు.