సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆఫీసు వద్ద వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ యువ నాయకులు కావటి దశరథం మాట్లాడుతూ.. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. ఆఖండ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పొనుగోటి విష్ణువర్ధన్రావు, జగన్, కుమార్, సుప్రీం టైలర్జి.నిరంజన్, తిరుపతయ్య, కొండల్తదితరులు పాల్గొన్నారు.
- January 12, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- INDIAN CULTURE
- KOTRA
- SWAMY VIVEKA
- కొట్ర
- భారత సంస్కృతి
- వివేకానందుడు
- Comments Off on కొట్రలో ఘనంగా వివేకానందుని జయంతి