సామాజిక సారథి, చొప్పదండి: నేటి యువతకు వివేకానందుడు ఆదర్శప్రాయుడని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ రాంబాబు కొనియాడారు. నెహ్రూ యువకేంద్ర, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా చొప్పదండిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో వివేకానంద యూత్ క్లబ్ అధ్యక్షుడు దూస రామ్, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జాగిరి సాయిగణేష్, ప్రధాన కార్యదర్శి తాడూరి శివకృష్ణ, యువజన సంఘం నాయకులు పిట్టల చాణిక్య, ఏముండ్ల రాకేష్, గంగు సంపత్, ఏముండ్ల రాజు, పెద్ది వీరేశం, ఎండీ హసిఫ్, హనుమండ్ల కొటేష్, కొత్త అఖిల్, గుంటి రాజు, గొల్లపల్లి సదన్, పిట్టల శ్రీకాంత్, బత్తిని అనిల్, హరీశ్, వేణు, ఉప్పి, అజయ్, కార్తీక్, వంశీ, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- August 12, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- KARIMNAGAR
- VIVEKANADA
- కరీంనగర్
- చొప్పదండి
- వివేకానందుడు
- Comments Off on యువతకు వివేకానందుడే ఆదర్శం