సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రైతుబంధు సమితి సభ్యుడు పాల నర్సయ్య తండ్రి కొండయ్య ఇటీవల కన్నుమూశాడు. అతని కుటుంబాన్ని సోమవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య పరామర్శించారు. అలాగే వారం రోజుల క్రితం సౌదీలో చనిపోయిన బోదాసు నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ పరిస్థితి చూసి ఏనుగు మనోహర్ రెడ్డి రూ.ఐదువేలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె శంకర్ రూ.ఐదువేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మడిశెట్టి ఆనందం, కేసీరెడ్డి నర్సారెడ్డి, మంచే రాజేశం, గంగం మహేష్, దెయ్యల కమలాకర్, పూదారి శ్రీనివాస్, అల్లూరి రాజిరెడ్డి, కోడిగంటి శ్యాం, గొళ్లెం నర్సింగ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
- July 12, 2021
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- TRS
- VEMULAWADA
- టీఆర్ఎస్
- రుద్రంగి
- వేములవాడ
- Comments Off on బాధిత కుటుంబాలకు పరామర్శ