Breaking News

‘లైలా’గా మైమరపించనున్న విశ్వక్

Vishwak Sen in lady get-up!!

Vishwak Sen in lady get-up!!

తన విలక్షణ నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తున్న విశ్వక్ సేన్ మరొక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైలా’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నట్టు విశ్వక్ ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహుగారపాటి నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయుచున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఆ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. పోస్టర్‌ను బట్టి ఇది ఒక విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నట్టు అర్థమవుతుంది. ఆ పోస్టర్‌లో ఉన్న విశ్వక్ సేన్ లేడీ గెటప్ ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారింది.

Vishwak Sen in lady get-up!!
ఇంతకీ పోస్టర్లో ఉన్నట్లుగా విశ్వక్ సేన్ సినిమా అంతా అమ్మాయిల గెటప్‌లో ఉంటారా లేదా కొన్ని ప్రత్యేక సన్నివేశాల్లో మాత్రమే అలా కనబడతారా అనేది చిత్రం విడుదల తర్వాతే మనకు స్పష్టత వస్తుంది.
ఏదేమైనా విశ్వక్ ధైర్యానికి ఇదొక మచ్చుతునక, కేవలం మాస్ పాత్రలు మాత్రమే చేయగలడు అనుకుంటున్న సమయంలో సెంటిమెంట్ ని పండించే ‘పాగల్‘, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ లాంటి పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననల్ని పొందాడు. ఇప్పుడు మళ్లీ ఈ లేడీ గెటప్ వేస్తూ తనలో ఉన్న ఇంకో వైవిధ్యాన్ని మనకు పరిచయం చేయడానికి రెడీ అయిపోయాడు. ఏది ఏమైనా తన సాహసానికి మనం కూడా హాట్సాఫ్ చెబుదాం.

బాలయ్య వారసుడి తెరంగేట్రం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *