సారథి, ఖమ్మం: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో జగదల్‌పూర్‌కు చేరుకున్న ఆయన సైనికులకు నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతంలో వోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి రాయపూర్, బీజాపూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా జగదల్‌పూర్ పర్యటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
- April 5, 2021
- Archive
- Top News
- జాతీయం
- amithasha
- CHATTISGARH
- terram encounter
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- ఛత్తీస్‌గఢ్
- తెర్రం ఎన్కౌంటర్
- Comments Off on ఛత్తీస్‌గఢ్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా