హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతలను బీజేపీ నేతల నుండి ఆర్థిక మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తెలంగాణకు గిరిజన యూనిర్సిటీ, ఐఐఎం, ఎన్ఐడీ, ఎన్ఐఎస్ఈఆర్ విద్యా సంస్థలను కేటాయించాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే రైల్వే లైన్స్, జాతీయ రహదారుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 2023 ఎన్నికల నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కేంద్రం నుండి తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- January 17, 2022
- Archive
- Top News
- జాతీయం
- లోకల్ న్యూస్
- Comments Off on బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ