సారథి ప్రతినిధి, జగిత్యాల: భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం బీజేపీ జగిత్యాల రూరల్ మండల కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా బీజేపీ జిల్లా ఇన్చార్జ్ బి.చంద్రశేఖర్, మండల ఇన్చార్జ్ సుంకేట్ దశరథ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులపై మూడెకరాల భూమి వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొట్టవతిని భారత్, గోస్కుల గంగాధర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కొక్కు గంగాధర్, చేనేత సెల్ కన్వీనర్ కొక్కుల గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎడమల శేఖర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కార్న్ రాజేందర్, మండల ఉపాధ్యక్షుడు కంది అంజిరెడ్డి పాల్గొన్నారు.