సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి గుండేటి విజయ్ కుమార్, కొడిమ్యాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ గౌడ్, చొప్పదండి మండల అధ్యక్ష,ఉపాధ్యక్షుడు సంబోజి సునీల్, ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ది రాజేందర్, బండారి రాజేష్, తాళ్లపల్లి మహేష్, సంపత్ కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
- August 2, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- YOUTH CONGRESS
- నిరుద్యోగ భృతి
- యూత్‌కాంగ్రెస్
- సీఎం కేసీఆర్
- Comments Off on నిరుద్యోగ భృతి ప్రకటించాలి