సారథి, రాయికల్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. టెస్టులు చేస్తే పదుల సంఖ్యలో కొవిడ్కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్జిల్లా రాయికల్ పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన టెస్టింగ్ కేంద్రంలో 100 మందికి గురువారం కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ గా వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ కృష్ణచైతన్య తెలిపారు. అందులో రాయికల్ పట్టణానికి చెందిన 11 మంది, మహితాపూర్ కు చెందిన నలుగురు, కట్కాపూర్ వాసులు ఇద్దరు, అయోధ్య కు చెందిన ఇద్దరు, మూటపెల్లిలో ఒకరికి, కుమ్మరిపెల్లిలో ఐదుగురికి, తాట్లవాయిలో ఇద్దరికి, భూపతిపూర్ లో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వారికి మెడికల్ కిట్లు అందజేసి హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈవో శ్రీనివాస్, సూపర్ వైజర్తిరుమల శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్లు సంతోష్, భూమయ్య, ఏఎన్ఎం లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
- April 30, 2021
- Archive
- కరీంనగర్
- CARONA
- covid19 testing
- rapid tests
- కరోనా
- టెస్టింగ్
- రాయికల్
- ర్యాపిడ్ టెస్టులు
- Comments Off on వణికిస్తున్న కరోనా మహమ్మారి