Breaking News

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

సారథి న్యూస్, మేడారం: మినీమేడారం జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనాకు వ్యాక్సిన్​ వచ్చిందన్నారు. ఏర్పాట్ల కల్పనపై గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జంపన్న వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. టాయ్​లెట్స్​ వద్ద నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. మేడారం వచ్చే భక్తుల వసతి కోసం తాత్కాలిక, శాశ్వత గదుల్లో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హన్మంతు జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏఎస్పీ సాయిచైతన్య, ఆర్డీవో రమాదేవి, జడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీఆర్డీవో పారిజాతం, మేడారం ఈఓ రాజేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అమ్మవారిని మొక్కుతున్న మంత్రి సత్యవతి రాథోడ్​