సారథి, చొప్పదండి: కరోనా మహమ్మారి రోజురోజు విజృంభిస్తున్న నేపథ్యంలో కౌలు రైతులు అనేక అవస్థలు ఎదురుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన కుక్కల రవి 15 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. వాతావరణ పరిస్థితుల అనుకులించక మామిడి కాయ సైజ్ పెరగక పోగా, ఇటీవల కురిసిన గాలివాన భీభత్సానికి చెతికొచ్చిన పంటకాస్తా నేలపాలయ్యిందని వాపోతున్నాడు. అప్పులు తెచ్చి పంటకు పురుగుల మందులు పిచికారి చేస్తే ప్రకృతి అన్నదాలపై కనికరించడంలేదన్నారు. ఇప్పటికైన కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యనే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
- May 31, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Chopdandi
- District
- FARMER
- KARIMNAGAR
- MANGO
- TERROR
- Tornado
- గాలివాన
- చొప్పదండి
- భీభత్సం
- మామిడి
- రైతు
- Comments Off on గాలివాన భీభత్సం… ఆందోళనలో ఆ రైతు