Breaking News

సంఘాల పేరుతో అధికారులను బెదిరించడం సబబు కాదు

సంఘాల పేరుతో అధికారులను బెదిరించడం సబబు కాదు
  • ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిళ్ల దశరథం

సామాజిక సారధి, బిజినేపల్లి: జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడిని కులం పేరుతో దూషించి, బూటు కాళ్లతో తన్నాడని ఎస్సై ఓబుల్ రెడ్డిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, ప్రజాసంఘాల నాయకులు పబ్బం గడుపుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిల్ల దశరథం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమేనని జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడు వ్యవహరించిన తీరుపై, మేము కూడా విచారణ చేశామని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే పత్రిక ద్వారా విచారిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల పేరు చెప్పి అధికారులను బెదిరిస్తూ విధులకు అటంకం కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలో దాడి జరిగిందని, ఆ దాడితో అవమానం జరిగిందని చెబుతున్న బాధితులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. అవమానం జరిగిందని చెపుతున్నా జడ్పీ చైర్మన్ భర్త బంగారయ్య మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడని, చైర్మన్ పద్మావతి ఏ ధర్నాలోనైనా పాల్గొందా అంటూ ప్రశ్నించారు. అవమానం జరిగిన వారికి లేని బాధ దళిత సంఘాలకి ఎందుకన్నారు. దాడులు జరిగినప్పుడే మాత్రమే సంఘాలు గుర్తుకొస్తాయా అని ప్రశ్నించారు. ఎస్ఐ ఓబుల్ రెడ్డి తన విధులను సక్రమంగానే చేశాడన్నారు. దాడి జరిగినప్పుడు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామ, అవమానం ఎక్కడ జరగలేదని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నాటినుంచి చైర్మన్ పద్మావతికి ఎన్నిసార్లు అవమానాలు జరిగినా ఎప్పుడు దళిత సంఘాలు ఖండిస్తున్నాయని తెలిపారు. దళిత సంఘాల నాయకులకు వాస్తవాలు తెలుసుకోవాలని, ఎస్సై ఓబుల్ రెడ్డిపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.