Breaking News

‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్

‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్​

సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్​జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు వచ్చిన రైతులకు సకల సౌకర్యాలు కల్పించి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని ఆకాంక్షించారు. రైతుల తిప్పలు చూడలేక సీఎం కేసీఆర్ ప్రతి తహసీల్దార్ ఆఫీసును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. రిజిస్ట్రేషన్లు ​అయిన వెంటనే రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, తహసీల్దార్ కోమల్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ఐ రజని, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.