సారథి న్యూస్, ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. వేసవిలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీక్షేత్రాల్లో కంపార్ట్మెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీక్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. శాటిలైట్ ఆధారంగా ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందిన వెంటనే సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తుందని తెలిపారు. ఎవరైనా అడవులకు నిప్పుపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- February 10, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- DFO
- FOREST DEPORTMENT
- MULUGU
- అటవీశాఖ
- డీఎఫ్వో
- ములుగు
- Comments Off on అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే