Breaking News

తిప్ప తీగనా.. మజాకా

తిప్ప తీగనా.. మజాకా

కరోనా సెకండ్​ వేవ్​ విపరీతంగా వ్యాపిస్తున్న వేళ తిప్ప తీగ పేరు ఇప్పుడు తరుచుగా వినిపిస్తోంది. దీని గురించి సోషల్ ​మీడియా, పేపర్లు, టీవీ చానళ్లలో తెగ ప్రచారం జరుగుతోంది. అసలేమిటి తిప్పతీగ. దాని ప్రత్యేకతలు ఏమిటనే విషయాలను తెలుసుకోవాలని అందరిలోనూ ఉంది. పల్లెల్లో అయితే మన కళ్లముందే ఉంటున్నా దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మనకు ప్రకృతిలో దొరుకుతున్నాయి. అందులో తిప్ప తీగ ఒకటి. కరోనా సమయంలో అది మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ తీగ పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామీణులకు దీని గురించి బాగానే తెలుసు. పట్టణ శివారు, రోడ్ల పక్కన, పాడుబడిన గోడలకు కూడా పెరుగుతుంటుంది. తిప్ప తీగను ‘అమృత’, ‘గుడూచి’ అని కూడా పిలుస్తుంటారు. ఇది తమలాపాకు మాదిరిగా ఉంటుంది. తిప్పతీగలకు మరణం ఉండదు. వేర్లు తెంపినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, కరెంట్​ తీగలపై ఎక్కడైనా పాకుతూ పోతూ ఉంటాయి. ఇందులో విశేషమైన వైద్యగుణాలు ఉన్నాయి. దీన్ని మనం ఏదో రకంగా వాడితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు.

– తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలికాయ అంత ఉండలు చేసి 10రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రోగనిరోధిక శక్తి బాగా పెరుగుతుంది. దీని ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదు.. వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను ‘శంశమినివటి’ పేరుతో మందులు తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
– తిప్పతీగ ఆకుల్లోనే కాకుండా కాడల్లోనూ వైద్యగుణాలు ఉన్నాయి. కిడ్నీ సంబంధిత జబ్బులు, డయాబెటిస్​తో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించుకోవచ్చు.
– తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
– అజీర్తితో బాధపడేవారు తిప్పతీగతో తయారుచేసిన మందులు వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య తొలిగిపోతుంది.
– తిప్పతీగలో యాంటీ ఇన్​ఫ్లెమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాఇయ. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఈ మందులు బాగా పనిచేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్​వంటి వ్యాధులను తగ్గిస్తాయి.
– అర్థరైటిస్​( కీళ్ల వ్యాధులు) తగ్గించే గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమాటాయిడ్​ అర్థరైటిస్​ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
– తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు ఉంటాయి.
గమనించాల్సిన ముఖ్య విషయాలు..
– తిప్పతీగతో తయారు చేసిన మందులను గర్బిణులు, పాలిచ్చే తల్లులు వాడకూడదు.
– తిప్పతీగ జౌషధాలను ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.