సామాజిక సారథి, మహబూబ్ నగర్, నవాబుపేట్: పాన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే మండల పరిధిలోగల కొల్లూరు గ్రామంలో గేటు దగ్గర పాన్ షాప్ లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల నరేష్ గత ఏడాది నుంచి కొల్లూరు గేటుపై ఉన్న దాబాల దగ్గర పాన్ షాపు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నానని చెప్పారు. శనివారం రాత్రి 10గంటలకు తన వ్యాపారాన్ని ముగించుకొని యధావిధిగా ఇంటికి వెళ్ళాడు. ఆదివారం ఉదయం షాపు తెరచేందుకు షాపువద్దకు రాగ, పాన్ షాపు తళాలు పగలగొట్టి ఉన్నాయన్నారు. షాపులోని కొంత నగదుతో పాటు భారీగా రూ.40వేల విలువ గల సిగరెట్ డబ్బాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు నరేశ్ తెలిపారు.
- December 12, 2021
- Archive
- క్రైమ్
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- చోరీ
- నవాబుపేట్
- పాన్
- మహబూబ్ నగర్
- షాపు
- Comments Off on పాన్ షాపులో చోరీ