రూ.3లక్షల విలువైన పంచలోహ విగ్రహాల అపహరణ
సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గుట్టపై వెలిసిన వేంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలను ఎత్తికెళ్లారు. వేంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, పద్మావతి విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. సుదర్శనచక్రం, స్వామి, మరో రెండు విగ్రహాలను ఎత్తికెళ్లారు. వాటి విలువ సుమారు రూ.రెండు లక్షల మేర ఉంటుందని పూజారి శివయ్యశర్మ తెలిపారు. సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై బాలవెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించింది. దొంగతనం జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. గ్రామస్తులు, పూజారిని దొంగతనం జరిగిన విషయమై ఆరాతీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.