- రూ.6లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీ
- నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు
సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం పులిజాల గ్రామంలోని మైత్ర సోలార్ ప్లాంట్ లో చోరీ జరిగింది. ప్లాంట్ లోని సోలార్ ప్యానల్ బోర్డులకు అమర్చే కాపర్ కేబుల్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ మేరకు స్టార్ క్యూ బెక్స్ కంపెనీ బాధ్యులు చిలక పూర్ణచంద్రారెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో 13మంది సెక్యూరిటీ, సూపర్ వైజర్, టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు ఆరువేల మీటర్ల కాపర్ కేబుల్ ను దొంగలించారని పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.ఆరులక్షల వరకు ఉంటుందని తెలిపారు. సెక్యూరిటీ విభాగం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగర్ కర్నూల్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.