సారథి, కొల్లాపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ఇంటింటా చెత్తసేకరణ, డంప్ యార్డుల నిర్వహణ, శ్మశాన వాటికకు చెత్తను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ట్రాక్టర్‌ను సమకూర్చిందన్నారు. గ్రామాల్లో అసంపూర్తి పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ పనులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
- July 4, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- CM KCR
- KOLLAPUR
- PALLEPRAGATHI
- ఎమ్మెల్యే బీరం
- కొల్లాపూర్
- సీఎం కేసీఆర్
- Comments Off on పేదల సంక్షేమమే ధ్యేయం