సామాజిక సారథి, హన్మకొండ: ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజివ్గాంధీ హనుమంతు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, నగర కమిషనర్ ప్రావీణ్య లతో కలసి మైనార్టీ లతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ తీసుకోకుండా మిగిలిన వారు గడువు పూర్తయిన ఆధారంగా తమంతట తాము ముందుకు వచ్చి రెండవ డోస్ టీకా తీసుకోవాలని అన్నారు. హనుమకొండ, వరంగల్ నగరం లలోని మైనార్టీ కాలనీ లలో ఎక్కువ శాతం కోవిడ్ టీకా మొదటి, సెకండ్ డోసులు తీసుకొని 18 సంవత్సరాలు నిండినవారు ఉన్నారని, ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవడానికి మసీదులలో విస్తృతంగా ప్రచారం చేయాలని, అదేవిధంగా ఇంటింటికి టీకా వేయడానికి వచ్చే వైద్య సిబ్బందికి సహకరించాలని ఉభయ జిల్లాల కలెక్టర్ లు సూచించారు. ఈ సమావేశంలో డీఎ అండ్ హెచ్ వో లలితాదేవి, డీఎండబ్లువో శ్రీను, ఇంచార్జ్ అడిషనల్ కమీషనర్ విజయ లక్ష్మి, , సీఎం హెచ్ వో రాజారెడ్డి, మైనార్టీలు, తదితరులు పాల్గొన్నారు.
- December 3, 2021
- Archive
- లోకల్ న్యూస్
- COLLECTOR
- HANMAKONDA
- HEALTH
- OFFICERS
- VACCINE
- ఆఫీసర్లు
- కలెక్టర్
- వ్యాక్సిన్
- హన్మకొండ
- హెల్త్
- Comments Off on వ్యాక్సిన్ తీసుకోవాలి