సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ట్యాంక్ బండ్ పై అమరుడి విగ్రహం లేకపోవడం విచాకరమన్నారు. దొడ్డి కొమురయ్య భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించి వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్, కార్యదర్శి జక్కుల అంజయ్య, బైకం రాజు, నంగి బీరయ్య, సోషల్ మీడియా కన్వీనర్ గాండ్ల వేణు పాల్గొన్నారు.
- July 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- doddi komurayya
- KARIMNAGAR
- కరీంనగర్
- చొప్పదండి
- దొడ్డి కొమురయ్య
- Comments Off on దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అందరికీ ఆదర్శం