Breaking News

నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్‌ హీరో నాగార్జున ట్వీట్‌ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్‌ చేశారు. ఇదే సమయంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమాలోని పాట ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా, సీతారామశాస్త్రి అకాలమృతి కారణంగా  పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ సినిమా నుంచి ’బంగార్రాజు నీకోసం’ అనే సాంగ్‌ టీజర్‌ను డిసెంబర్‌ 2న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.