సామాజికసారథి, రామకృష్ణాపూర్: మంచి వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ‘సామాజిక సారథి’అగ్రగామిగా నిలుస్తుందని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై బి.అశోక్ అన్నారు. ‘సామాజికసారథి’ తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ నాయకులు, వర్తక, వాణిజ్య వ్యాపారస్తుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుందని గుర్తుచేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని చేరవేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
- January 20, 2023
- Archive
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on ‘సామాజిక సారథి’ అగ్రగామిగా నిలవాలి