- ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయభాస్కర్
సామాజిక సారథి,హన్మకొండ: దళితుల జీవితాల్లో ఆత్మగౌరవం పెంపోందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాడని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. డీబీఎఫ్ వరంగల్ జిల్లా 10వ మహాసభలు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుంచు రాజేందర్ అద్యక్షతన గురువారం హన్మకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగాయి. ఈ మహాసభలో ఎమ్మెల్యే వినయభాస్కర్ మాట్లాడుతూ డీబీఎఫ్ ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా కొనసాగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు,కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్, పూలే అలోచనతో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కార్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, మాలమహానాడు జాతీయ ఉపాధక్షుడు మన్నే బాబురావు, అంకేశ్వరు రాంచందర్ రావ్, గొసంగి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మంద మల్లేషం, మహాత్మజ్యోతిరావ్ పూలే రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్, బీఎస్ఐ నాయకులు బొమ్మల్ల అంబేద్కర్, సింగారపు రవిప్రసాద్, మేడ రంజిత్, బొర్ర సంపూర్ణ, మేకల అనిత,సిలువేరు బిక్షపతి, చుంచు మల్లయ్య,యాక నారాయణ్,అలువాల ఐలయ్య, కుమారస్వామి, నరేష్ ,రాజు, చిరంజీవి, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.