Breaking News

బొల్లన​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

బొల్లన్​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్​పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ ​కామెపల్లి భాస్కర్​ను.. టీఆర్ఎస్​ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ ​రవీంద్ర కుమార్​ నాయక్​ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ ​గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ ​సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్​ను అడిగి వివరాలు ఆరాతీశారు. నిరంతరం ప్రజల్లో ఉండి.. ప్రజల కోసం సేవ పనిచేస్తున్న భాస్కర్ ​ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలు కావడం పట్ల ఎమ్మెల్యే ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయాన్ని వైద్యశాఖ మంత్రి టి.హరీశ్​రావు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయ సహకారాలు అందిస్తానని సర్పంచ్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ​నాయక్ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి హన్మంతు వెంకటేశ్​గౌడ్, టీఆర్ఎస్​ డిండి మండలాధ్యక్షుడు రంగినేని వెంకటేశ్వర్​రావు, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.
మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి పరామర్శ
కాగా, అంతకుముందు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి హన్మంతు వెంకటేశ్ ​గౌడ్.. బొల్లనపల్లి గ్రామ సర్పంచ్ కామెపల్లి భాస్కర్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. మంత్రి కూడా సర్పంచ్​ భాస్కర్​ను ఫోన్​ లో పరామర్శించారు. వైద్యఖర్చుల పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు సర్పంచ్​ కామెపల్లి భాస్కర్​ సోదరుడు, వెల్దండ పంచాయతీరాజ్​శాఖ ఏఈ కామెపల్లి మహేందర్​, టీచర్​ లక్ష్మయ్య దగ్గరుండి వైద్యచికిత్సలను చూసుకున్నారు. అలాగే పలువురు బొల్లనపల్లి గ్రామస్తులు, టీఆర్ఎస్​ మండల నాయకులు.. భాస్కర్​ను ఆస్పత్రిలో పరామర్శించి వెళ్లారు.