నివాళులర్పించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
సారథి, వెల్దండ: కల్నల్ సంతోష్ కుమార్ త్యాగం వృథాకాదని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ కొనియాడారు. చైనా, భారత సరిహద్దులో దేశరక్షణ కోసం యుద్ధరణరంగంలో అసువులుబాసిన ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ కుమార్ అమరత్వానికి ప్రతీకగా మంగళవారం వెల్దండ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సంతోష్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని కొనియాడారు. కార్యక్రమంలో రైతు సమన్వయ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, ఇన్ చార్జ్ తహశీల్దార్ వెంకటరమణ, జడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ విజయ జైపాల్, వైస్ ఎంపీపీ శాంతి, మార్కెట్ కమిటీ చైర్మర్ బాలయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు రామకృష్ణ, ఉప్పల సంతోష్, బిక్కుమాండ్ల శ్రీను, పాలది సంతోష్, సర్పంచ్ లు పొనుగోటి వెంకటేశ్వరరావు, కుమార్, నాయకులు కృష్ణారెడ్డి, జైపాల్ నాయక్, వెంకటయ్య, మల్లయ్య, అలీం, వివిధశాఖల అధికారులు, ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.