Breaking News

ర్యాగింగ్​ కలకలం

ర్యాగింగ్ కలకలం
  • సూర్యాపేట మెడికల్​కాలేజీలో ఘటన
  • విచారణకు ఆదేశించిన మంత్రి హరీశ్​రావు

సామాజికసారథి, హైదరాబాద్‌: సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు స్పందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ చేయాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డిని ఆదేశించామన్నారు. ఈ ఘటనకు కారకులను వదిలిపెట్టేది లేదని, ర్యాగింగ్‌ అనేది నిషేధమని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. సీనియర్‌ విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ఓ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సర విద్యార్థి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కొందరు సీనియర్లు బాధిత విద్యార్థి ఒంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి ఫొటోలు తీశారు. అంతే కాకుందా ట్రిమ్మర్‌తో జుట్టు తొలగించేందుకు యత్నించారు. సీనియర్ల నుంచి తప్పించుకున్న బాధిత విద్యార్థి హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ర్యాగింగ్‌ విషయాన్ని వివరించాడు. సదరు విద్యార్థి తండ్రి డయల్‌ 100కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని పోలీసులు రక్షించారు. ర్యాగింగ్‌ ఘటనపై స్పందించిన మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మెడికల్‌ కాలేజీలో విచారణకు చేపట్టారు.