సామాజిక సారథి, వెల్దండ: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తిపై నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు చేయి చేసుకున్నారనే ప్రచారం సరికాదని అఖిలపక్ష నేతలు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి పట్ల కొంచెం గట్టిగా మాట్లాడారని తెలిపారు. ఎస్సై నర్సింహులు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాల ప్రజల పట్ల సౌమ్యంగా ఉంటారని తెలిపారు. సమస్య ఎలాంటిదైనా, ఎవరు స్టేషన్‌కు వెళ్లినా చాలా సావధానంగా వింటూ పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనపై బురద చల్లే ప్రయత్నంలో కొందరు సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారని తెలిపారు. అలాంటి కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మోతిలాల్, ఎంపీపీ విజయ జైపాల్ నాయక్, ఎంపీటీసీలు గుత్తి వెంకటయ్య, పబ్బు చక్రవర్తి, సర్పంచ్‌లు దార్ల కుమార్, చెర్కు రేవతి రాజశేఖర్, ఉప్పు అపర్ణ తిరుమలరావు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బనావత్ శంకర్ నాయక్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పోలె రాజు, ఎన్ఎస్యూఐ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు తక్కెళ్లపల్లి శేఖర్, తాండ్ర జంగయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- November 15, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- si narsihmulu
- VELDANDA
- ఎస్సై నర్సింహులు
- వెల్దండ
- Comments Off on ఎస్సై నర్సింహులుపై బురద చల్లొద్దు