సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్‌కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, కేజీబీవీ ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
- January 28, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- CRT TEACHERS
- KGBV TEACHERS
- MULUGU
- STU UNION
- ఎస్టీయూ
- కేజీబీవీ టీచర్లు
- ములుగు
- సీఆర్టీ టీచర్లు
- Comments Off on కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి