- టెలిమెడిసిన్ ద్వారా మరింత మెరుగైన సేవలు
- ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీకా వేసుకోవాలి
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సామాజిక సారథి, హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 15వ గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెలి మెడిసిన్ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ సేవలు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని, ఆరోగ్య సూచీలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచినందుకు ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. కొవిడ్‌పై పోరులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీకా వేసుకోవాలని సూచించారు. ఫార్మాసూటికల్స్‌లో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తోందని, రోజురోజుకూ మెడికల్ టూరిజం పెరుగుతోందన్నారు. దేశంలో రూరల్ హెల్త్‌కేర్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.