సారథి, చొప్పదండి: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి తహసీల్దార్ ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. పైగా దళితుల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే దళితుడు అయినప్పటికీ ఏఒక్క రోజు కూడా దళితుల పక్షాన మాట్లాడలేదని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించలేదని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ రజితకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, మండల కార్యదర్శి గజ్జెల లక్ష్మణ్, చంద్రయ్య, అంజమ్మ, రేణుక, అనిల్, కె.స్వరూప, లక్ష్మి, పి.మౌనిక, పుష్పలత, సుగుణ, రాజేశం, కొమ్ము రాజమ్మ, సంధ్య, లక్ష్మీ, రాజవ్వ, సరోజన, పి.మమత పాల్గొన్నారు.
- July 12, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- CM KCR
- DOUBLE BEDROOM
- TELANGANA
- చొప్పదండి
- డబుల్ ఇండ్లు
- సీఎం కేసీఆర్
- Comments Off on పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి