సారథి న్యూస్, ఏటూరునాగారం: ప్రజాసమస్యలపై అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను ఏటూరునాగారం పోలీసులు అరెస్టు చేయడం సరికాదని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కావిరి అర్జున్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను అణచలేరని అన్నారు. రాష్టానికి దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం మండల నాయకులు వినుకోళ్లు చక్రవర్తి, గద్దల ప్రణయ్, మహిళా నేతలు పాలక గంగ, నాగమణి, రజిని, ప్రేమలత, గిరిజన మోర్చా అధ్యక్షుడు కొప్పుల నవీన్, ఓబీసీ అధ్యక్షుడు చిటమాట శ్రీవాస్, బుర్రి కిరణ్, చిలువేరు చేసిరెడ్డి, పెద్ది సుధాకర్ ఉన్నారు.
- March 26, 2021
- Archive
- Assembly siege
- BJP
- dalith morcha
- అరెస్టులు
- అసెంబ్లీ ముట్టడి
- దళితమోర్చా
- బీజేపీ
- Comments Off on అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు