సారథి, వేములవాడ: స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదుల పాత్ర మరువలేనిదని గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ వేములవాడ శాఖ సీఈవో, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాచమనేని శ్రీనివాసరావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, భూమేష్, రేగుల దేవేందర్, గోపి, కిషోర్ రావు, అనిల్, గుడిసె సదానందం, నక్క దివాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేద, ధనిక అనే తేడాలు లేకుండా న్యాయం చేయాలనే తపనతో న్యాయవాదులు కృషిచేస్తున్నారని కొనియాడారు.
అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఒకప్పుడు అగ్రవర్ణ, ధనిక కుటుంబాల వారు మాత్రమే న్యాయవాద వృత్తిలో ఉండేవారని, కానీ నేటి సమాజంలో ప్రతిఒక్కరూ ఈ వృత్తిని ఎంచుకుని రాణిస్తున్నారని తెలిపారు. అణగారిన, బడుగు బలహీనర్గాల ప్రజలకు ఉచితంగా న్యాయసేవలు అందించాలని కోరారు. తమ సేవలను గుర్తించి సన్మానించిన గోదావరి బ్యాంకు యాజమాన్యం, డైరెక్టర్ల బృందానికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్లు సన్నిధి వెంకటకృష్ణ, పాత శ్రీధర్, చెన్నమనేని కరుణాకర్ రావు, బ్యాంక్ మేనేజర్లు శ్రీరాములు, వేణుగోపాల్, శివనకం శ్రీకాంత్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.