సారథి, వాజేడు: స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే స్వేరోస్ జ్ఞానగర్జన కార్యక్రమం పోస్టర్లను పెనుగోలు కాలనీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పాయం నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేజీబీవీ, మినీ గురుకులం స్కూళ్లలో సిబ్బందితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వాజేడు సర్పంచ్, జడ్పీటీసీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది చేతులమీదుగా పోస్టర్లను విడుదల చేశారు.
జ్ఞానగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ములుగు కోకన్వీనర్ వాసం వెంకటేశ్వర్లు, ములుగు జిల్లా స్వేరోస్ సభ్యులు నల్లెబోయిన పాపారావు, పాయం దిలీప్, పూనెం సృజన్, అజయ్, అనంత్, శశిధర్, శివాజీ, విజయ్ పాల్గొన్నారు.