- మెదక్ ఆర్డీవో సాయిరాం
సారథి, పెద్దశంకరంపేట: లారీల్లోని ధాన్యం లోడును వెంటనే ఖాళీచేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ముందుగా స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాంలోకి వెళ్లి చూశారు. నిర్ణీత వ్యవధిలోనే సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. వచ్చేనెల బియ్యం డబుల్ కోటా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గోదాం ఇన్ చార్జ్ ప్రదీప్ కుమార్ కు సూచించారు. మండలంలోని రాచరాయ రైస్ మిల్లు, సిద్ధివినాయక, సప్తగిరి రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ఆయా సెంటర్ల వారీగా తొందరగా రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ చరణ్ సింగ్, ఆర్ ఐ ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.