సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో బీసీ గురుకులాలు ఉన్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు బీసీ విద్యార్థులపైన నిజమైన ప్రేమ ఉంటే తక్షణమే శాశ్వత భవనంతో పాటు సిబ్బందిని నియమించాలన్నారు. విద్యార్థులకు ముక్కిన కూరగాయలు పెడుతున్నారని ఆరోపించారు. తెల్కపల్లి బీసీ గురుకుల పాఠశాల కోళ్ల షెడ్లల్లో నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి గురుకులాన్ని ఇంటర్ నేషనల్ స్కూలుగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రాంచందర్, తాలూకా అధ్యక్షుడు బండి పృథ్వీరాజ్, మంతటి శేఖర్, ఎన్.బాలరాజ్, రెడ్డపాకుల శివ, సుల్తాన్, సురేష్, ఆనంద్, నాగరాజు, దశరథం పాల్గొన్నారు.