నాగర్ కర్నూల్ , సామాజిక సారథి : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన పేదల పార్టీని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తేనే దళిత బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం తెలకపల్లి మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో హథ్ సే హథ్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకోవడంతో నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు . అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి , ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు . అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఒకరు కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరుస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం మాఫియాను ప్రోత్సహిస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు భూములను పంపిణీ చేయడం జరిగిందని ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేయడం జరిగిందని , గ్రామాలకు రోడ్లను వేయడం జరిగిందని అన్నారు . రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు . ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడూరు జెడ్పిటిసి రోహిణి గోవర్ధన్ రెడ్డి , తెలకపల్లి జెడ్పిటిసి సుమిత్ర బాలయ్య , సీనియర్ నాయకులు నారాయణ గౌడ్ , కోటయ్య , తిమ్మాజీపేట పాండు , కౌన్సిలర్ నిజాముద్దీన్ , తో పాటు మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గౌడ్ , నాయకులు పర్వతాలు తో పాటు నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు