- వేములవాడ టౌన్లో మిషన్ భగీరథ కోసం తవ్విన రోడ్లు
- రోడ్లపైనే మట్టి.. వాహనదారులకు ఇబ్బందులు
- ఇంట్లోకి వస్తున్న దుమ్ము.. ఊపిరిపీల్చుకునేందుకు కష్టం
సారథి, వేములవాడ: పేరుకే సిమెంట్ రోడ్లు.. చూస్తే మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. వేములవాడ పట్టణంలోని మిషన్ భగీరథ పనుల పేరుతో రోడ్లను తవ్వి మట్టిని వదిలేస్తున్నారు కాంట్రాక్టర్లు. మిషన్ భగీరథ పైపు లైన్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పైగా ఈ రోడ్లపై వాహనాలు వెళ్తుంటే దుమ్మ రేగుతోంది. అసలే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంతో ప్రజలంతా భయపడి ఇంటికే పరిమితమయ్యారు. ఈ తరుణంలో దుమ్ము ఇంట్లోకి రావడంతో శ్వాసతీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇకనైనా వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ తమ ఇబ్బందులను అర్థం చేసుకుని రోడ్లను బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లపై ఉన్న మట్టిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.