సారథి, చొప్పదండి: సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్రమోడీ దేశం గర్వించదగిన ప్రధాని అని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ కొనియాడారు. ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చొప్పదండి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లోని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, మాస్క్ లు, సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి పట్టణ ప్రధాన కార్యదర్శులు బత్తిని ప్రశాంత్, గుండేటి వెంకటరమణ, దండే రమాదేవి, సంగ నరేష్, గుర్రం సమరసింహ, మంచికట్ల మల్లేష్, తాడూరి శివకృష్ణ , గుండేటి శివశంకర్, సిరిపురం శ్రీనివాస్, తాడూరి రామకృష్ణ, కొక్కుల ప్రణీత్, జిట్టా కుమార్, రొడ్డవేని రాజు, గంగు సంపత్, అనుమాండ్ల కోటేష్, ఏముండ్ల రాజు పాల్గొన్నారు.
సరుకులు పంపిణీ
చొప్పదండి మండలంలోని చాకుంటలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఐకేపీ హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం మాట్లాడుతూ కరోనా కల్లోలంలో దేశ ప్రధాని బాధితులకు భరోసాగా నిలిచారని, దేశంలో సేవా హి సంఘటన్ సేవా కార్యక్రమాలు లాక్ డౌన్ నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అస్థిరి తిరుపతి, పాలకుర్తి శ్రీకాంత్, దాసరి వంశీ, కడాసి అఖిల్, కుడిదల రఘు పాల్గొన్నారు.