Breaking News

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవాలని, అలాగే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డాక్టర్ సవిత కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్​ఆఫీసర్​షబ్బిర్ హుస్సేన్, చంద్రన్న , సంధ్యారాణి, ఫార్మసిస్ట్ తిరుమలరావు, ఇందిరమ్మ, కంప్యూటర్ ఆపరేటర్ సోనీ, ఆరోగ్యశ్రీ ప్రసాద్, ఆశావర్కర్లు పాల్గొన్నారు.