సారథి న్యూస్, మెదక్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ మన చెంతకు వచ్చేసింది. శనివారం మెదక్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మొదటి ప్రాధాన్యతగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 టీకా వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ మీట్ లో పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను నియంత్రించేందుకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభించుకోవడం అద్భుతమని అన్నారు. ఇమ్యునిటీని పెంచే ఈ సురక్షితమైన టీకాను దశలవారీగా ప్రాధాన్యతా క్రమంలో వేస్తామన్నారు. రెండవ ప్రాధాన్యంలో పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు, మూడవ ప్రాధాన్యంలో 50 ఏళ్లు పైబడిన, 50లోపు దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ఈ టీకా ఇస్తామన్నారు. మెదక్, నర్సాపూర్ లో కోవిషీల్డ్ టీకాను ఇస్తున్నామని, ఈ టీకా తీసుకున్నవారు మళ్లీ ఇదే మందు టీకాను 28 రోజుల తర్వాత తీసుకోవాలని, ఈ టీకా ద్వారా 70 శాతం రక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డీఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీపీవో తరుణ్ పాల్గొన్నారు.
- January 16, 2021
- Archive
- Top News
- CARONA
- COVISHIELD
- MLA PADMA
- MODI
- VACCINE
- కరోనా వ్యాక్సిన్
- పద్మాదేవేందర్‌రెడ్డి
- మెదక్
- Comments Off on కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది..