Breaking News

బావిలోకి దూసుకెళ్లిన కారు

బావిలోకి దూసుకెళ్లిన కారు
  • తల్లీకొడుకు మృత్యువాత
  • సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి

సామాజిక సారథి, దుబ్బాక: కారు వేగం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు బుధవారం మృతిచెంచాడు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు లక్ష్మి(50), ప్రశాంత్ (26) కారులో |హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద టైరు పేలడంతో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరుగంటల పాటు శ్రమించి కారును బావి నుంచి బయటికి తీశారు. రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. మోటార్ల సాయంతో బావిలోని నీరు కొంత మేర తీసివేసిన అనంతరం బావి లోపల ఉన్న కారుకు గజఈతగాడు నర్సింహులు తాడు బిగించాడు. తాడు బిగించిన అనంతరం పైకి వచ్చే క్రమంలో కారుకు చిక్కుకుపోయి నర్సింహులు నీటిలోనే మృతిచెందాడు. మరోవైపు బావిలోకి దూసుకెళ్లిన కారులో నుంచి లక్ష్మీ, ప్రశాంత్ మృతదేహాలను వెలికితీశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు సంఘటన స్థలికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు.

లక్ష్మి(ఫైల్ ఫోటో)
ప్రశాంత్ (ఫైల్ ఫోటో)
మృతి చెందిన గజఈతగాడు..