సామాజికసారథి దేవరకొండ: గిరిజన దేవాలయాలలో పనిచేసే బావోజీలకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు ఉంటారు. అని,గిరిజన దేవాలయాలలో పని చేసే బావోజీకు ధూప దీప నైవేద్యం పథకం ద్వార గౌరవ వేతనం అందించాలని కోరారు. నెల రోజులలో బావోజిలకు గౌరవ వేతనం అందిస్తాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు అని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు.
- May 19, 2023
- Top News
- SALARIES
- గౌరవ వేతనం
- Comments Off on బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి