Breaking News

ఏజెన్సీలో వేలం పాట రాజ్యాంగ విరుద్ధం

ఏజెన్సీలో వేలం పాట రాజ్యాంగ విరుద్ధం

సారథి, నూగూరు వెంకటాపురం: ఏజెన్సీలో వేలంపాట రాజ్యాంగ విరుద్ధమని, గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి అన్నారు. మంగళవారం ఏఎన్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ ఆశీలు, జంతు వధశాల, కొలగార కాటరుసుం, బందెలదొడ్డి వేలంపాట ఏజెన్సీలో పెసా గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ ఈవో పెసా చట్టానికి విరుద్ధంగా వేలంపాట నిర్వహించాలని ప్రకటించడం సరికాదన్నారు. వేలం పాట నిర్వహించడం బినామీ వ్యవస్థను ప్రోత్సహించినట్టు అవుతుందన్నారు. తక్షణమే ఆ ఆలోచనను విరమించుకుని గ్రామసభ నిర్వహించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పూనెం సూర్యం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.