సారథి, మానవపాడు: నడిగడ్డలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ మానవపాడు మండలాధ్యక్షుడిగా గొల్ల విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే భారీఎత్తున జిల్లాలో చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తంచేశారు.
పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని విజయ్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, కేకే రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్, బీజైవైఎం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ శర్మ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అబ్దుల్లా, వడ్డేపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, రాజోలి అధ్యక్షుడు సంజీవ రెడ్డి, యువమోర్చా మండలాధ్యక్షుడు మధు, మహిళ మోర్చా అధ్యక్షురాలు రాధిక, అశోక్, లాలు, ప్రశాంత్, నాగరాజు, ఈశ్వర్, జమీర్, నాగముని, కేశవ్ పాల్గొన్నారు.