తెలుగు ఇండస్ట్రీకి కన్నడ నుంచి వచ్చిన మోడల్ నభా నటేశ్. ‘ఇస్మార్ట్ శంకర్’ లో తన అందాలతో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత ఆమె డేట్స్ దొరకడం కష్టమైపోయింది. అంతగా బిజీ అయింది. రవితేజ .. నితిన్ .. సాయితేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ వంటివారి జోడీగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. బొద్దుగా ఉన్నప్పటికీ .. డాన్సులలోను మంచి మార్కులే కొట్టేసింది. అలాంటి నభా కొంతకాలంగా తెరపై కనిపించకపోవడంతో, ఇతర భాషల్లో ట్రైల్స్ లో ఉందేమోనని అనుకున్నారు. కానీ అసలు సంగతిని ఆమె ఇటీవలే చెప్పింది. తనకి జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా బెడ్ రెస్ట్ తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాననీ .. మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నానని అంది. అందులో భాగంగానే స్విమ్మింగ్ పూల్ పక్కనే వివిధ భంగిమల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు తాను చాలా సన్నబడిపోయి స్లిమ్‌గా కనిపిస్తోంది. ఇక త్వరలోనే యంగ్ హీరోల జోడీగా ఆమె పేరు వినిపిస్తుందేమో చూడాలి.
- January 26, 2023
- Archive
- CINEMA GALLERY
- సినిమా
- Cinema
- Comments Off on అసలు సంగతి అది కాదంటా!