సారథి ప్రతినిధి, నాగర్‌కర్నూల్: రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అన్ని జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా టీజీవో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి(ఆర్టీవో) స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి.రాజశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శిగా భగవేణి నరసింహులు, ఉపాధ్యక్షులుగా వి.తిరుపతయ్య, ఖాజమైనోద్దిన్, ఎస్టీవో రాజు, కోశాధికారిగా డాక్టర్ వేముల శేఖరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఖదీర్, జాయింట్ సెక్రటరీగా గోరేటి శ్రీనివాసులు, ఎం.పర్వతాలు, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ, బి.రాజేశ్వరరెడ్డి, ప్రచార కార్యదర్శిగా ఎం.మధుసూదనశర్మతో పాటు 24మందితో పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులను పూర్వపు కమిటీ అభినందించి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా కమిటీ సభ్యులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సామాజికసేవలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. నూతన కమిటీని కలెక్టర్ శర్మన్ అభినందించారు. నూతనోత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు.