సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) ఫైనల్ కీ విడుదలైంది. బుధవారం టెట్ కన్వీనర్ రాధారెడ్డి కీని విడుదల చేశారు. జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల సమయం దగ్గరపడుతున్నా ఇంకా టెట్ ఫైనల్ కీ విడుదల కాలేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు.
ఫలితాల కోసం ఎదురుచూపు
జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల15న ప్రైమరీ కీ విడుదల చేశారు. ఇందులో పేపర్ 1లో 7,930, పేపర్ 2లో 4,663 అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై అధికారులు కసరత్తు చేశారు. ప్రస్తుతం ఫైనల్ కీ విడుదలైంది. ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.